VZM: మెరకముడిదాం మండలం ఊటపల్లి గ్రామంలో రబీ 2025-2026 సీజన్లో ఈ- పంట నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సును ఇంఛార్జ్ వ్యవసాయ అధికారిని అనురాధ మంగళవారం నిర్వహించారు. సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామ సభ ద్వారా రబీలో సాగుచేసిన పంటల వివరాలు రైతు సేవ కేంద్రం VAA రైతు వారీగా చదివి వినిపించటం జరిగింది. ఉద్యాన పంటలు వేయదల్చిన వారికి ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తున్నాయన్నారు.