ASR: అల్పపీడనం కారణంగా రెండు రోజులపాటు నిలిచిపోయిన పాపి కొండల విహారయాత్ర శనివారం నుంచి పునఃప్రారంభం అవుతుందని జలవనరుల శాఖ ఏఈ భాస్కర్ తెలిపారు. గురు, శుక్ర వారాల్లో పాపికొండల యాత్రను అధికారులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే శనివారం నుంచి అనుమతులు రావడంతో రెండు రోజుల క్రితమే పాపి కొండలు వెళ్లడానికి బోటు నిర్వాహకులు ఆన్లైన్లో టికెట్లు విక్రయించారు.