GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తారక రామా నగర్ మెయిన్ రోడ్డు నుండి ఎస్వీఎన్ కాలనీ 8వ అడ్డ రోడ్డు, ఎస్వీఎన్ కాలనీ 6వ అడ్డు రోడ్డు శ్రీ తులసి రెసిడెన్సీ వరకు రూ. 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.