SKLM: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచి క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. ఆదివారం ఆలయానికి రూ.5,29,382 ఆదాయం వచ్చిందని ఇందులో దర్శన టికెట్లు ద్వారా రూ.2,39,500, ప్రసాదాలు అమ్మకం ద్వారా రూ.2,18,382. విరాళాల రూపంలో రూ.71,077 సమకూరిందని అధికారులు తెలిపారు.