TPT: నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ములాఖత్‌లో కలిశారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. అరెస్టులతో ప్రజల కోసం పోరాడే నాయకులను భయపెట్టలేరని అన్నారు. హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు.