కోనసీమ: అయినవిల్లి మండలం మాగాం గ్రామంలో సోమవారం రాత్రి సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు స్థానిక కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. సత్తెమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.