CTR: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 126 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ కోటేశ్వరయ్య, వీరయ్య తెలియజేశారు. డిగ్రీ కళాశాలలో జేకేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 165 మంది పాల్గొనగా అందులో 126 మంది విద్యార్థులకు సంబంధిత కంపెనీ వారు ధ్రువీకరణ పత్రాలను అందజేసినట్లు తెలిపారు.