CTR: బైరెడ్డిపల్లె(మం) కడపనత్తంలోని శ్రీ అలిమేలు మంగమ్మ, పద్మావతమ్మ సమేత నలగుండ్రాయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆలయ ధర్మకర్త మురళీ స్వామి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, సప్తద్వార పూజ, వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహిస్తారని, భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.