SS: పెనుకొండలో ఆటో కార్మికులు మంగళవారం సమావేశం నిర్వహించారు. ట్రాన్స్ పోర్టు రంగం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని ప్రైవేట్ పరంచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతుందన్నారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.