VSP: డప్పు కళాకారుల సమస్యల పరిష్కారానికి జనవరి 19న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని ఏపీడీకెయస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షన్ విడుదల, గుర్తింపు కార్డులు, బీమా, భూమి కేటాయింపు వంటి డిమాండ్లు నెరవేర్చాలన్నారు.