BPT: రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం, మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు తెలిపారు. కర్లపాలెంలో ఆయన మాట్లాడుతూ.. పెన్షన్, హెల్త్ కార్డులు వంటి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నామన్నారు. సమస్యలు ఉన్న మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు తమ అసోసియేషన్ల ద్వారా సమస్యలను తెలియజేయాలని కోరారు.