SKLM: అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే గొండు శంకర్ అండగా నిలిచారు. శ్రీకాకుళం దమ్మలవీధి లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డున పడిన ఫాతిమా బేగం కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే శంకర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. MLA తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి తన వంతుగా 10,000 రూపాయల నగదు, నిత్యవసర వస్తువులు అందజేశారు.