NDL: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సీనియర్ రాజకీయ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనార్థమై ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రం, లడ్డు ప్రసాదాలతో సత్కరించారు.