ASR: సెప్టెంబర్ 11 నుండి 13 వరకు పాండిచేరిలో జరుగనున్న జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు పాడేరు జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న వంతలి సింహాచలం, పాతుకోట రాజశేఖర్, తలారిసింగి సీఏహెచ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గల్లెల రామ్ చరణ్, బుల్లేరి చంద్రశేఖర్ ఎంపికయ్యారు. ఈ మేరకు వారిని బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అభినందించారు.