KDP: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఇవాళ నుంచి 20వ తేదీ వరకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకోబోతున్నట్లు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఎలిశెట్టి పవన్ గురువారం తెలిపారు. వారోత్సవాల భాగంగా 14న యూకేజీ నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు జాతీయ నాయకుల వేషధారణ పోటీలు, 8వ నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహిస్తారని తెలిపారు.