కడప: జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి పాలాభిషేకం చేశారు. రామ సుబ్బారెడ్డి కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 116 మంది వైసీపీ కార్యకర్తలు రక్తదానం చేశారు.