ప్రకాశం: ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కనిగిరి పట్టణంలోని కూచిపూడిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. కూచిపూడి పల్లికి చెందిన జొన్నలగడ్డ సృజన్ (52) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.