కృష్ణా: బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు అందరూ కలిసి బాధ్యత తీసుకోవాలని ICDS సూపర్వైజర్ కె. సుమిత్ర అన్నారు. బాపులపాడు (M) రేమల్లెలోని ZP పాఠశాలలో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లూధర్ పౌల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కిషోరి బాలికలకు బాల్య వివాహాల దుష్ప్రభావాలు, అవి చట్టరీత్యా నేరమని వివరించారు.