CTR: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ డిసెంబర్ 27న వైసీపీ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు మురుగేష్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలు పెంచమని, అవసరమైతే తగ్గిస్తానని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేడు కరెంట్ ఛార్జీలను పెంచడం ఆయన నైజానికి నిదర్శనమన్నారు.