ఎన్టీఆర్ గృహాల నిర్మాణం వేగవంతంగా చేపట్టాలని హౌసింగ్ ప్రత్యేక అధికారి పి. వరప్రసాద్ అన్నారు. ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిమ్మాపురం, గాజులు కొల్లివలసలో ఉన్న ఎన్టీఆర్ గృహాల లబ్ధిదారులుకు అవగాహన కల్పించి, వేగవంతంగా నిర్మాణాలు చేపట్టాలని అన్నారు.