ASR: మొంథా తుఫాన్ కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు డుంబ్రిగుడ మండలంలోని పలు గ్రామాలను అతలాకుతలం చేసింది. మండలంలోని గసభలో కిముడు సతీశ్ అనే గిరిజనుడికి చెందిన రేకుల ఇల్లు భారీ వర్షానికి బుధవారం ఉదయం నేలమట్టమయింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.