E.G: విశ్వకర్మ జయంతి & నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న అమరావతిలో ‘సృష్టి’ నామకరణంతో విశ్వకర్మ యజ్ఞోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో బీజేపీ శ్రేణులు విశ్వబ్రాహ్మణ అభ్యుదయ యువజన సంఘ నాయకులతో కలిసి ‘సృష్టి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు.