VZM: తుఫాన్ నేపథ్యంలో ఎస్.కోట మండలంలో ప్రభుత్వ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు మండల విద్యాశాఖ అధికారి నర్సింగరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో కలెక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. కాగా, విద్యార్థులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో శనివారం పాఠశాలలకు యధావిధిగా వెళ్లిన విద్యార్థులు ఇళ్లకు వెనుతిరిగారు.