ALR: మన్యం కాఫీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉందని దీన్ని గిరిజన సహకార సంస్థ ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని, రైతులంతా సహకరించాలని జీసీసీ ఎండీ కల్పనాకుమారి అన్నారు. శనివారం ఐటీడీఏ పీవో అభిషేక్‌తో చింతపల్లిలో జీసీసీ, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈఏడాది కాఫీకి గిట్టుబాటు ధర కల్పించామన్నారు.