KDP: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్య మంత్రి చంద్రబాబుతోనే సాధ్యం అవుతుందని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తెలిపారు. కడప నగరంలోని పలు ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర 2047 గ్రామ సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని గుర్తు చేశారు.