NTR: విజయవాడ నార్త్ నూతన ఏసీపీగా స్రవంతి రాయ్ శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఏసీపీగా విధులు నిర్వహించిన రాజారావుకు పదోన్నతిపై వెళ్లారు. ఈ సందర్భంగా ఏసీపీ స్రవంతి రాయ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తానని చెప్పారు.