VZM: జిల్లాలోని లోక్సత్తా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తిరుమలలో లడ్డూ అపచారంపై మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందంటూ జరుగుతున్న ఆందోళనలో వాస్తవాలు బయటకి రావాలంటే, సీఎం చంద్రబాబు వేసిన సిట్ దర్యాప్తు సరిపోదని, కేంద్ర ప్రభుత్వం వెంటనే సీబీఐకి ఈ కేసును అప్పగించాలని డిమాండ్ చేశారు.