KRNL: వెల్దుర్తి మండలంలోని యాదరాళ్ల గ్రామానికి చెందిన సుంకన్న బుధవారం పని నిమిత్తం డోన్‌కు వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. స్కూటర్‌పై వెల్దుర్తిలో నుంచి రైల్వే గేట్ దాటి హైవే పైకి వెళ్తుండగా వెనుకనుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుంకన్న కాలుకు తీవ్రగాయం కావడంతో స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.