ప్రకాశం: రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కనిగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో రూ.3 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.