CTR: పుంగనూరు పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాశ్ పేర్కొన్నారు. పుంగనూరు పట్టణంలోని తాటిమకులపాళ్యంలో సోమవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ ప్రచారం చేపట్టారు. సచివాలయ ఉద్యోగులు, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి 100 రోజుల కరపత్రాలను అందజేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.