నెల్లూరు: నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నెల్లూరు నగర DSP శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చెడు వ్యసనాలకు బానిసై ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.5,01,000 విలువ చేసే బంగారం, వెండి, ల్యాప్టాప్, LED టీవీలను స్వాధీనం చేసుకున్నారు.