VZM: మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకురాలు పడాల అరుణ కుమారుడు శరత్ అకాల మరణం బాధాకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. శరత్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పుత్ర శోకాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.