NLR: ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య సందర్శించారు. ఎమర్జెన్సీ మెడికల్ టీం వివరాలు, అందుబాటులో ఉంచిన అత్యవసర మందులు, ఈ నాలుగు రోజుల్లో డెలివరీ కాబడే గర్భవతులు గురించి చర్చించారు. ప్రతి ఒక్క వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని సిబ్బందికి తెలిపారు.