ASR: జిల్లా ప్రజల జీవితాలు వెలుగులమయం కావాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ఆకాంక్షించారు. గురువారం దీపావళి పండగ పురష్కరించుకొని జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళి పండుగ జరుపుకుంటామని, ప్రజలందరూ చెడును వీడి మంచి వైపు పయనించి వారి జీవితాలు వెలుగులమయం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.