అనంతపురం: గ్రామాలలో పేద ప్రజలకు మంచి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవారం పామిడి మండలం కత్రిమల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో గడపగడపకు తిరుగుతూ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించారు.