గుంటూరు: ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులకు శనివారం ఉచితంగా రేబిస్ టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పశువైద్యశాల ఉప సంచాలకులు వైద్యురాలు ఎం. రత్నజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం నుంచి కొత్తపేటలోని పశువైద్యశాలలో టీకా వేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.