ELR: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండవల్లి మండలంలోని ఇంగిలిపాకలంక జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నుంచి మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు జె.శాంతకుమారి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలురకు అండర్-14, 17 విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా క్రీడా మైదానంలో అన్ని వసతులు సమకూర్చినట్లు శాంతకుమారి చెప్పారు.