నంద్యాల: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ స్వాములు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పాములపాడు మండల కేంద్రంలోని తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం కురిసిన అకాల వర్షానికి రైతులు పండించిన సోయచిక్కుడు, మొక్కజొన్న, ధాన్యం తడిసి పోయాయన్నారు.