ELR: ట్రిపుల్ ఐటీని ప్రక్షాళన చేసి.. విద్యార్థులు చదువుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారథి ట్రిపుల్ ఐటీ అధికారులను ఆదేశించారు. ఇటీవల ట్రిపుల్ ఐటీలో ఆహార నాణ్యతలోపం, విద్యార్థుల అనారోగ్యం, విద్యార్థుల ఆందోళన తదితర పరిస్థితులపై నూజివీడులోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి సమీక్షించారు.