ASR: జీ.మాడుగుల ఎస్సైగా షణ్ముఖరావు బుధవారం నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఎస్సైగా పనిచేసిన శ్రీనివాస్ అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటకు బదిలీ అయ్యారు. ఈమేరకు ఆయన స్థానంలో జీ.మాడుగుల ఎస్సైగా షణ్ముఖరావు నియమితులయ్యారు. ఈమేరకు ఆయన నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై షణ్ముఖరావు తెలిపారు