అన్నమయ్య: పీలేరు పట్టణంలోని బోడెంపల్లి చెరువులో మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మహిళ నడుముకు రాయి కట్టుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందా లేక వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో పీలేరు ఎస్సైలు లోకేష్, బాలకృష్ణలు విచారిస్తున్నారు.