VZM: పార్వతీపురం పట్టణానికి చెందిన ఎన్.సోమయ్యకు 52 ఏళ్ల వయస్సు. నిరుపేద. కూటమి నేతలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందజేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన సచివాలయానికి వెళ్లి పింఛన్ దరఖాస్తు ఎప్పుడు తీసుకుంటారు బాబూ అంటూ అక్కడి సిబ్బందిని ఆరా తీశాడు. వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేదని చెప్పడంతో ఈ ఏడాది పింఛన్ లేనట్టేనా ‘అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.