కోనసీమ: అమలాపురం మండలం జనుపల్ల న్యూ కాలనీకి రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ బుధవారం బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంఛార్జ్ పొలమూరి మోహన్ బాబు ఆధ్వర్యంలో, కాలనీ ప్రజలందరూ, ఎమ్మెల్యే ఆనందరావుని కలిశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ గత పాలకులు కాలనీకి రోడ్డు వేయడంలో నిర్లక్ష్యం వహించారని కచ్చితంగా రోడ్డు నిర్మిస్తామన్నారు.