SKLM: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శిర్ల ప్రసాద్ సోమవారం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్కి వినతిపత్రం అందించారు. భూముల రీ సర్వేలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.