Singer Coco Lee : విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత
ఆసియాలోనే అత్యధికంగా సింగర్ కోకో లీ అల్బమ్స్ అమ్ముడయ్యాయి. ఇటీవలె ఆ సింగర్ కోకో లీ తీవ్ర డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నారు. నేడు ఆమె మరణించినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు.
ప్రముఖ సింగర్, హాంకాంగ్‌కు చెందిన గాయని కోకో లీ(Singer Coco Lee) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ నేడు మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబీకులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
గాయని కోకో లీ(Singer Coco Lee) గతంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. హిడెన్ డ్రాగన్ సినిమాలోని ఎ లవ్ బిఫోర్ టైమ్ అనే సాంగ్ పాడారు. ఆ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. అంతేకాకుండా అవార్డుల ప్రధానోత్సవంలో కోకో లీ ప్రదర్శన ఇచ్చారు. ఈ రకంగా ఆమె ప్రదర్శన ఇచ్చిన తొలి చైనీస్ అమెరికన్‌గా నిలిచిపోయారు.
గత కొంత కాలంగా ఆమె డిప్రెషన్‌తో బాధపడటం వల్ల ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆమె సోదరి కరోల్, నాన్సీలు తెలిపారు. చనిపోయేంత వరకూ సింగర్ కోకో లీ(Singer Coco Lee) కోమాలోనే ఉందని వారు వెల్లడించారు. కోకో లీ మొదట ఆసియాలో పాప్ సింగర్‌గా తన కెరీర్ మొదలుపెట్టారు. 1996లో సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తొలి చైనీస్ గాయనిగా ఆమె రికార్డుకెక్కారు. ఆమె చేసిన కోకో లీ ఆల్బమ్ ఆసియాలోనే అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్‌గా నిలిచిపోయింది.