Dil Raju : కన్ఫామ్.. పాతికేళ్ల హీరోయిన్ మోజులో దిల్ రాజు!
టాలెంట్ ఉంటే చాలు.. దిల్ రాజు(Dil Raju) పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే యంగ్ మళయాళీ బ్యూటీని తెలుగు సినిమాల్లోకి తీసుకున్నాడు. ఇప్పటికే ఆ బ్యూటీ ఓ డబ్బింగ్ సినిమాతో యూత్‌లో యమా క్రేజ్ తెచ్చుకుంది. అందుకే దిల్ రాజు వారసుడితో డైరెక్ట్‌గా తెలుగులో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు.
టాలెంట్ ఉంటే చాలు.. దిల్ రాజు(Dil Raju) పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే యంగ్ మళయాళీ బ్యూటీని తెలుగు సినిమాల్లోకి తీసుకున్నాడు. ఇప్పటికే ఆ బ్యూటీ ఓ డబ్బింగ్ సినిమాతో యూత్‌లో యమా క్రేజ్ తెచ్చుకుంది. అందుకే దిల్ రాజు వారసుడితో డైరెక్ట్‌గా తెలుగులో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఆమె ఎవరో కాదు యంగ్ హీరోయిన్ ‘ఇవానా'(Ivana). ఈ బ్యూటీ ఇప్పటికే తెలుగు కుర్రకారును టెంప్ట్ చేసేసింది. ఆ మధ్య ‘లవ్ టుడే'(Love Today) అనే తమిళ్ సినిమాను తెలుగులో డబ్ చేశాడు దిల్ రాజు. తమిళ్‌తో పాటు తెలుగులోను ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. ఇవానా గ్లామర్‌కు యువత ఫిదా అయిపోయింది.
అమ్మడి క్యూట్ క్యూట్ చేష్టలకు పడిపోయారు. ముఖ్యంగా లవ్ టుడే(Love Today) క్లైమాక్స్‌లో ఇవానా(Ivana) ఫోటో మార్ఫింగ్ న్యూడ్ సీన్ చూసి హీటెక్కిపోయారు. అలాగే బుజ్జికన్నా అనే డైలాగ్స్‌కు ఫిదా అయిపోయారు. అందుకే ఈ క్యూట్ బ్యూటినీ ‘సెల్ఫీష్’ సినిమా(Selfish Movie)లో హీరోయిన్గా తీసుకున్నాడు. రౌడీ బాయ్స్ సినిమాతో దిల్ రాజు వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్ రెడ్డి(Ashish reddy). ఇప్పుడు ఈ అప్‌కమింగ్ హీరో సుకుమార్ శిష్యుడు కాశి విశాల్ దర్శకత్వంలో ‘సెల్ఫీష్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ డైలాగ్స్ అందిస్తుండగా.. దిల్ రాజు ప్రొడక్షన్స్‌తో కలిసి సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తోంది.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా ఇవానా(Ivana) నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మీట్ మిస్టర్ చైత్ర.. అంటూ ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఇవానా చాలా సింపుల్‌గా కట్టిపడేస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు దిల్ రాజు(Dilraju) బ్యానర్లో రాబోయే సినిమాలకు ఇవానాను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాతికేళ్లు కూడా లేని ఈ బ్యూటీని.. దిల్ రాజు స్టార్ హీరోయిన్ని చేస్తాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందుకే.. పాతికేళ్ల హీరోయిన్ మోజులో దిల్ రాజు ఉన్నాడని చెప్పొచ్చు.