»Zara Hatke Zara Bachke Surprising With Its Collections
Zara Hatke Zara Bachke Movie: కాసుల వర్షం కురిపిస్తున్న జరా హత్కే జరా బచ్కే..!
'జరా హాట్కే జరా బచ్కే' జూన్ 2న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విక్కీ, సారా జంట కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో ప్రేక్షకులు సినిమాని చూడటానికి థియేటర్లకు తరలివస్తున్నారు.
బాలీవుడ్(Bollywood) స్టార్స్ విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన, ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం జరా హత్కే జరా బచ్కే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రివ్యూలు సాధించింది. వారాంతంలో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. మొదట అసలు ఈ మూవీ గురించి పెద్దగా బజ్ ఏమీ లేదు. కానీ విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయ్యి వారం అవుతున్నా, ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.
‘జరా హాట్కే జరా బచ్కే’ జూన్ 2న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విక్కీ, సారా జంట కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో ప్రేక్షకులు సినిమాని చూడటానికి థియేటర్లకు తరలివస్తున్నారు. ZHZB విడుదలైన ఐదు రోజుల్లోనే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్ల మార్కును దాటగలిగింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేరళ స్టోరీ, స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్-వెర్స్ల నుండి పోటీ ఉన్నప్పటికీ బలంగా నిలవగలిగింది.
ఈ చిత్రం మొదటి రోజు రూ. 5.25 కోట్లతో ప్రారంభమైంది. 5వ రోజు టిక్కెట్ విండోల వద్ద స్ట్రాంగ్హోల్డ్ను చూపిస్తూ రూ. 4 కోట్లు వసూలు చేసింది. కపిల్ (విక్కీ కౌశల్) , సౌమ్య (సారా అలీఖాన్) అనే ఇద్దరు కాలేజీ ప్రేమికుల ప్రేమ కథతో ఈ చిత్రాన్ని తెరెక్కించారు. పెళ్లయిన తర్వాత జరిగే లోపాలను కామెడీ రూపంలో నవ్వుకునేలా చెప్పేవారు. కామెడీ, కెమిస్ట్రీ, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 1వ వారం ఇప్పుడు రూ. 34 కోట్ల దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే కొనసాగితే, మూవీ రూ.50 కోట్లు కాదు, అంతకంటే ఎక్కువ కూడా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.