Jr.NTR : ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మార్చి 12న ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించనున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ అమెరికాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి, కీరవాణి,సెంథిల్ కుమార్.. అక్కడ పలు అవార్డ్స్ అందుకుంటూ సందడి చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మార్చి 12న ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించనున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ అమెరికాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి, కీరవాణి,సెంథిల్ కుమార్.. అక్కడ పలు అవార్డ్స్ అందుకుంటూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు హాలీవుడ్ లెవల్లో మార్మోగిపోతోంది. కానీ తారక్‌ను చాలా మిస్ అయ్యాడు చరణ్. నందమూరి తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లకుండా ఆగిపోయాడు. ఇక ఇక్కడ చేయాల్సిన అన్ని కార్యక్రమాలు అయిపోవడంతో.. అమెరికాలో ల్యాండ్ అయిపోయాడు యంగ్ టైగర్. వెళ్లడమే లేట్ అన్నట్టు.. వేటకెళ్లేందుకు రెడీ అవుతున్నట్టుగా ఓ ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకున్నాడు తారక్. బ్యాక్ సైడ్ పులి బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకొని.. చాలా స్టైల్‌గా బాల్కనీలో నిల్చొని.. అమెరికాను వేటాడబోతున్నట్టు ఓ ఫోటోని షేర్ చేశాడు. బెవర్లీ హిల్స్, కాలిఫోర్నియాలో ఉన్నట్టు తెలిపాడు. ఇక ఈ ఫోటో యంగ్ టైగర్ బిరుదుకి తగ్గట్టుగా.. వేటకెళ్లేందుకు రెడీ అవుతున్నట్టుగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌లో పులితో పోరాడతాడు యంగ్ టైగర్. దాంతో ఈ ఫోటోలో తారక్.. తనని తాను రిప్రెజెంట్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తంగా.. అమెరికాలో దిగగానే ఆస్కార్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.