తమ అభిమాన హీరోలను కలవాలి, మాట్లాడాలి, వారితో ఒక ఫోటో దిగాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. నిజంగా వారిని కలుసుకునే అవకాశం వచ్చినప్పుడు వారు ఆ కోరిక నెరవేర్చుకుంటారు. కొందరు తమ వింత వింత కోరికలను వారి ముందుపెడుతూ ఉంటారు. తాజాగా ఓ అభిమాని బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ని కూడా అలానే ఓ వింత కోరికను కోరాడట. కానీ, దానిని షారూక్ సున్నితంగా తిరస్కరించడం విశేషం.
షారూక్(ShahRukh Khan) నటించిన దివానా చిత్రం విడుదలై 31 సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా ఆయన ఈ సందర్భంగా అభిమానులతో షారుక్ సోషల్ మీడియా ద్వారా 31 నిమిషాల పాటు ముచ్చటించారు. ‘ఆస్క్ ఎస్ఆర్కే’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షారుక్ సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని షారుక్ ను ఒక కోరిక కోరాడు. మీతో కలిసి సిగరెట్ తాగాలని ఉందని అన్నాడు.
దీనికి షారుక్(ShahRukh Khan) ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. అతని కోరికను తిరస్కరించాడు. తన చెడు అలవాట్లను ఎవరితోనూ పంచుకోనని, అవి తనతోనే ఉంటాయని చెప్పారు. షారుక్ సమాధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. చాలా బాగా సమాధానం చెప్పారు సర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే, ఆ చెడు అలవాటును మీరు కూడా వదిలేయండి సర్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.