Devarakonda-Rashmika : విజయ్ దేరకొండ, రష్మిక మందన గురించి ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తునే ఉంటుంది. ఈ ఇద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించారు. ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ భలేగా వర్కౌట్ అయింది. అందుకే ఆఫ్ స్క్రీన్‌లోను ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. వాళ్లు కూడా కలిసి వెకేషన్లకు వెళ్తూ.. హాట్ టాపిక్ అవుతునే ఉన్నారు. కానీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హిట్ చూసి చాలా కాలం అవుతోంది. అయినా కూడా రౌడీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటాడు.. ఫ్యాన్స్‌కు సర్ప్పైజ్లు ఇస్తుంటాడు.. ఏదో ఓ రకంగా లైమ్ లైట్లో ఉండడం రౌడీ స్టైల్. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో18 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ టచ్ చేసి.. టాలీవుడ్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అలాంటిది లైగర్ సినిమా హిట్ అయి ఉంటే.. రౌడీ రేంజ్ వేరే లెవల్లో ఉండేది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో.. విజయ్ దేవరకొండ సీన్ రివర్స్ అయిపోయింది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా ఆగిపోయింది. ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే గీతా గోవిందం సీక్వెల్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హిట్ పెయిర్ రౌడీ, రష్మిక మరోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆన్ స్క్రీన్లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోను విజయ్, రష్మిక మధ్య ఎఫైర్ ఉందనేది ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తుంటారు. అందుకే విజయ్, రష్మిక మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనేది ఇండస్ట్రీ టాక్. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య దూరం పెరిగిందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 5 రష్మిక పుట్టినరోజు సందర్భంగా.. విజయ్ దేవరకొండ నుండి ఎలాంటి బర్త్ డే విష్ రాలేదు. దీంతో రౌడీ, రష్మిక దూరం అయ్యారా.. అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. కానీ విజయ్.. రష్మికకు పర్సనల్‌గా ఫోన్ చేసి విష్ చేసి ఉంటాడనేది ఇంకొందరి మాట. మరి నిజంగానే ఈ ఇద్దరికీ చెడిందా.. లేదంటే సోషల్ మీడియాలో పుకార్లు వస్తాయని భయపడి.. విజయ్ విష్ చేయలేదా.. అనేది వాళ్లకే తెలియాలి.